![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -335 లో.. మురారితో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి జరిగేలా చూడమని ముకుంద దేవుళ్ళకి మొక్కుకుంటుంది. అప్పుడే అక్కడికి సుమలత వచ్చి.. నీకు నచ్చిన మురారిని పెళ్లి చేసుకుంటున్నావ్ కదా ఇంకా టెన్షన్ ఎందుకని అంటుంది. ఎలా అంటున్నావని ముకుంద అనగానే.. భవాని అక్క నిర్ణయం కాబట్టి ఎట్టి పరిస్థితిలో అయిన పెళ్లి జరుగుతుందని సుమలత చెప్తుంది.
మరొకవైపు మురారి, కృష్ణతో గడిపిమ క్షణాలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. కృష్ణ భర్త ఎవరో తెలుసుకోవాలని మురారి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు. కృష్ణ భర్త గురించి గౌతమ్ ని అడగాలని మురారి అనుకుంటాడు. కానీ అతను ఎప్పుడో ఒకసారి వస్తాడు. అతనికి ఏం తెలుసని అడగకుండా సైలెంట్ గా ఉంటాడు మురారి. అప్పుడే మధు వచ్చి.. టీ తాగడానికి బయటకు వెళదాం వస్తావా అని అడుగుతాడు. బయటకు వెళ్లి మధుని కృష్ణ భర్త గురించి కనుక్కోవాలని భావించి.. వస్తానని మురారి అంటాడు. మరొకవైపు కృష్ణ తన పెళ్లి ఫోటోని ఇంట్లో అంత వెతుకుతుంది అయిన ఎక్కడ కన్పించదు మరొకవైపు కృష్ణ గురించి రేవతి ఆలోచిస్తు ఉంటుంది. అసలు ఏంటి కృష్ణ ఇంత జరుగుతున్నా, ఏం పట్టనట్టు ఉంది. అదే ఇంకెవరైన అయితే వేరేలా ఉండేవారు ఇది ఏకంగా ఇక్కడికి వచ్చి పనులు చేస్తుందంటూ రేవతి మనసులో అనుకుంటుంది. అప్పుడే నందు వచ్చి అమ్మా.. కృష్ణకి పెళ్లి అయిందని చెప్పింది కదా? ఇక కృష్ణతో మురారి క్లోజ్ గా ఉండడని రేవతికి నందు చెప్తుంది.
మరొక వైపు నందు, మురారి బయటకు వస్తారు. మురారి నిన్ను ఒకటి అడగాలని మధు తో అనగానే.. ఇప్పుడు మురారి ఏది అడిగిన నిజం చెప్పేయాలని అనుకుంటాడుమ. కృష్ణ భర్త ఎవరు నువ్వు చూసావా అని అడుగుతాడు. చూసాను అంటాడు. అప్పుడే ముకుంద ఫోన్ చేసి మురారికి ఎలాంటి విషయాలు చెప్పకంటూ వార్నింగ్ ఇస్తుంది..ఆ తర్వాత మురారితో ముకుంద మాట్లాడతుంది. ఎప్పుడు కృష్ణ గురుంచే మురారి అడిగేసరికి ముకుందకి కోపం వచ్చి అనవసరం అయిన విషయాలేం పట్టించుకోకని చెప్తుంది. కృష్ణ భర్త గురించి మధు తెలుసని అన్నాడు. ముకుంద నుండి కాల్ రాగానే టెన్షన్ పడ్డాడు. ఎందుకు ఏదైన లింక్ ఉందా అని మురారి అనుకుంటాడు. అప్పుడే మధు వస్తాడు. మళ్ళీ కృష్ణ భర్త ఎవరని అడుగుతాడు మురారి. అప్పుడే మధుని ప్రసాద్ పిలుస్తాడు. తరువాయి భాగంలో.. ఇంట్లో అందరిని కృష్ణ భర్త ఎవరని మురారి అడుగుతాడు. నువ్వే వెళ్లి డైరెక్ట్ గా కృష్ణని అడుగు అని మధు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |